మన్నవ PHCని సందర్శించిన ప్రత్యేక అధికారులు
GNTR: పొన్నూరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి నరసింహారావు, ఎంపీడీవో చంద్రశేఖరరావు బుధవారం మన్నవ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) సందర్శించారు. కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి, మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం దోప్పలపూడి సచివాలయాన్ని పరిశీలించి, అధికారులకు పాలనాపరమైన సూచనలు జారీ చేశారు.