ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

MHBD: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం ఎమ్మెల్యే మురళి నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిజేరియన్ వార్డులో బాలింతలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని వైద్యులకు సూచించారు. ఇది ప్రజా ప్రభుత్వం అని, ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదని, ఉద్యోగాలు పోతాయని వైద్యులను హెచ్చరించారు.