స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించనున్న మంత్రి

NLR: స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించనున్నారు మంత్రి పొంగూరు నారాయణ. సాయంత్రం 5 గంటలకి ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సన్నపరెడ్డి సురేశ్ రెడ్డి హాజరుకానున్నారు. ఆర్టీసీ అధికారులు అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు.