SC కమిషన్ ఛైర్మన్‌ను కలిసిన ఎమ్మెల్యే

GNTR: రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కేఎస్ జవహర్‌ను తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పలు విషయాలపై చర్చించి, షెడ్యూల్ కులాలకు సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టే అన్ని పథకాలు ప్రజలకు అందేలా చూడాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం జవహర్‌ను శ్రావణ్ కుమార్ శాలువాతో సత్కరించారు.