VIDEO: సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న జగనన్న కాలనీ
KDP: సిద్దవటం మండలం మాధవరం-1 సమీపంలో ఉన్న జగనన్న కాలనీ సమస్యలకు నిలయంగా మారింది. ఈ మేరకు సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని లబ్ధిదారులు అంటున్నారు. కాలనీ ఏర్పాటై ఏళ్లు కావస్తున్న అధికారులు కనీస సదుపాయాలు కల్పించలేక పోయారన్నారు. పలు వీధుల్లో మట్టి రోడ్లు దర్శనమిస్తున్నాయి అని, ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.