కనిగిరిలో CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ప్రకాశం: పేదల సంక్షేమ ప్రభుత్వ ధ్యేయమని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కుల నరసింహారెడ్డి అన్నారు. బుధవారం కనిగిరి నియోజకవర్గం స్థానిక టీడీపీ కార్యాలయం పరిధిలోని 25 మంది లబ్దిదారులకు రూ.16, 05, 862 రూపాయల CMRF చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం చంద్రబాబు పేదల పక్షపాతి అని, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి సహాయం అందుతుందన్నారు.