పార్థివదేహానికి నివాళులు అర్పించిన కలెక్టర్
జగిత్యాల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఆకుల శ్రీనివాస్ (DM&HO) శనివారం ఉదయం హఠాత్తుగా మృతి చెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ బీ. సత్య ప్రసాద్ ఆకుల శ్రీనివాస్ నివాసానికి వెళ్ళి, పార్థివ దేహానికి పూలతో నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.