'మేడారం-భద్రాచలం నేషనల్ హైవే నిర్మిస్తాం'

TG: నాగ్‌పుర్ నుంచి విజయవాడ కారిడార్ చేపట్టినట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 'సూర్యాపేట నుంచి దేవరపల్లి వరకు గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మించనున్నాం. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రహదారుల కనెక్టివిటీ మరింత పెరగనుంది. భద్రాచలం, బాసర, మేడారం క్షేత్రాలను అనుధానం చేస్తూ NHను నిర్మిస్తాం. జగిత్యాల-కరీంనగర్ హైవే విస్తరణ పనులను త్వరలోనే చేపడతాం' అని గడ్కరీ తెలిపారు.