VIDEO: టోకెన్ల కోసం రైతుల బారులు
నిర్మల్ జిల్లాలో మార్క్‌ఫెడ్, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో శనగ కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. శనగ పంటను విక్రయించేందుకు అధికారులు ఇచ్చే టోకెన్ల కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. శనగ టోకెన్ల కోసం రైతులు తానూర్‌లోని డాంగెపల్లి గోదాం వద్ద సోమవారం రాత్రి నుంచే పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు టోకెన్లు దొరుకుతాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు.