ఏలూరులో బైక్ దొంగల ముఠా అరెస్టు

ఏలూరులో బైక్ దొంగల ముఠా అరెస్టు

ఏలూరులో వరుస బైకు చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఏడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. నిందితులు తుత్తిక శ్రీనివాస్, చల్లా విజయ్ కుమార్, లక్ష్మీ శ్రీనివాసులు ముఠాగా ఏర్పడి ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.