ప్రచారానికి వెళ్లకుండా అరెస్టు: సీపీఎం
NLG: దేవరకొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యాటక సందర్భంగా ఈరోజు చిట్యాల పోలీసులు స్థానిక సీపీఎం నేతలను అరెస్టు చేసి అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా తమను అరెస్టు చేయడం సబబు కాదని నేతలు వాపోయారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, సరోజ, మండల నాయకురాలు మేడి సుగుణమ్మ అరెస్టయ్యారు.