ఉస్మానియా డివిజన్ ఆఫీసులో ఏసీబీ సోదాలు
TG: ఉస్మానియా వర్సిటీ బిల్డింగ్ డివిజన్ ఆఫీసులో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ డీఈఈ శ్రీనివాసులు చిక్కారు. ఉస్మానియా వర్సిటీ బిల్డింగ్స్ డివిజన్ డీఈఈగా శ్రీనివాసులు ఉన్నారు. బిల్లుల మంజూరుకు గుత్తేదారును రూ.11వేలు డిమాండ్ చేశారు. గతంలో డీఈఈకి రూ.6వేలు ఆన్‌లైన్‌లో గుత్తేదారు పంపారు. మరో రూ.5వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.