యూరియా కొరతను తీర్చాలని రైతుల రాస్తారోకో

PDPL :శ్రీరాంపూర్ మండల కేంద్రంలో యూరియా కొరతపై రైతులు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. యూరియా ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే సరఫరా చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎరువుల కొరత వల్ల పంటలు ఎండిపోతున్నాయని, రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.