వృద్ధులకు చట్టాలు ఆరోగ్యంపై అవగాహన

వృద్ధులకు చట్టాలు ఆరోగ్యంపై అవగాహన

JN: అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా జనగామ రుద్రమదేవి వృద్ధాశ్రమంలో వృద్ధుల చట్టాలు, ఆరోగ్యం, చురుకైన వృద్ధాప్యంపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సంక్షేమ అధికారి కెే.కోదండరాములు, క్యాథరిన్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు, సీడీపీవో సత్యవతి, సిబ్బంది పాల్గొని వృద్ధుల హక్కులు, ఆరోగ్య జాగ్రత్తలపై ముఖ్య సూచనలు అందించారు.