'రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలి'
KDP: విజయ్ దివాస్ సందర్భంగా బద్వేల్ ZPHS స్కూల్లో సైనికుల త్యాగాలను స్మరిస్తూ మాజీ సైనికులు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రక్తదానం చేయడంద్వారా ఎందరో ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు.