ఏకగ్రీవంగా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నూతన కార్యవర్గం
SKLM: ఆమదాలవలస ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఆమదాలవలస తాలూకా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. తాలూకా ప్రెసిడెంట్‌గా నక్క రమణమూర్తి, అసోసియేట్ ప్రెసిడెంట్ కె.మనోహర్, వైస్ ప్రెసిడెంట్‌గా పి.ఎన్ గోవింద్, జి.రాము, ఎన్నికయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు.