మహిళల ఆధ్వర్యంలో తులసీ దామోదర కళ్యాణం
SRD: ఖేడ్ పట్టణ శివారులోని నారాయణివారి ఉసిరి వనంలో పద్మశాలి మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం తులసీ దామోదర కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేసి దీపాలు వెలిగించారు. అత్యంత పరమ పవిత్రమైన కార్తీక మాసంలో దీపారాధన చేయడం వలన సర్వ శుభాలు కలుగుతాయన్నారు. కార్తీక వనభోజన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.