సనత్‌నగర్‌లో ఘర్షణ.. కొబ్బరి బొండాల కత్తితో దాడి
HYD: సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన గొడవ హింసాత్మకంగా మారింది. ఓ వ్యక్తి కొబ్బరి బొండాల కత్తితో దాడి చేయడంతో బాధితుడి పరిస్థితి విషమంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.