మద్యం తాగి వాహనం నడిపిన వారిపై కేసు నమోదు

ప్రకాశం: మద్యం తాగి వాహనం నడిపిన ఇద్దరిపై కేసు నమోదు చేశామని గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ గురువారం వెల్లడించారు. పట్టణంలో బుధవారం నిర్వహించిన బ్రీత్ పరీక్షలలో మద్యం తాగి వాహనం నడుపుతున్న ఇద్దరినీ గుర్తించినట్లు సీఐ తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి వారి వాహనాలను సీజ్ చేశామన్నారు. మద్యం తాగి వాహనం నడిపితే శిక్ష జరిమానా పడుతుందని సీఐ హెచ్చరించారు.