శ్రీ విరుపాక్షి మారమ్మకు ఆషాడ మాస పూజలు

CTR: పుంగనూరు మున్సిపల్ బస్టాండ్ సమీపంలో శ్రీ విరుపాక్షి మారెమ్మకు ఆషాడ మాసం రెండవ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయాన్నే అమ్మవారి శిలా విగ్రహాన్ని అర్చకులు ఫల పంచామృతాలతో అభిషేకించారు. అమ్మవారిని పసుపు, కుంకుమ, నవధాన్యాలతో ప్రత్యేకంగా వివిధ రకాల పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు పెద్ద ఎత్తున నేతి దీపాలు వెలిగించారు.