పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం

ప్రకాశం: దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన గిద్దలూరులో చోటు చేసుకుంది. అక్కల్‌రెడ్డిపల్లిలో గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో తన భార్య వార్డు మెంబర్‌గా గెలవడం వల్ల ఒక వర్గం కక్ష కట్టి దాడి చేసిందని బాధితుడు ఆరోపించారు. పోలీసుల దగ్గర న్యాయం జరగకపోవడంతో, కోర్టులోనూ మాట్లాడే అవకాశం లభించకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.