VIDEO: గండేపల్లిలో రోడ్డు నిర్మాణ పనులు పరిశీలిన
KKD: గండేపల్లి మండలంలోని సింగరంపాలెంలో నిర్మాణంలో ఉన్న సిమెంట్ రోడ్లను రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహనరావు బుధవారం పరిశీలించారు. రోడ్ల నిర్మాణం నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.