'అనకాపల్లి కలెక్టర్‌పై సీబీఐ విచారణ జరపాలి'
VSP: అనకాపల్లి జిల్లాలో దేవాదాయ శాఖకు చెందిన విలువైన భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేవాలయ భూములపై కలెక్టర్ ఇచ్చిన నివేదిక తప్పుదారి పట్టించేలా ఉందని విమర్శించారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలన్నారు.