వినాయక విగ్రహాల తరలింపులో జాగ్రత్తలు తీసుకోవాలి

వినాయక విగ్రహాల తరలింపులో జాగ్రత్తలు తీసుకోవాలి

JGL: వినాయక చవితి సందర్భంగా విగ్రహాల తరలింపులో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, జగిత్యాల ఎస్ఈ సుదర్శనం సూచించారు. ఇప్పటికే జిల్లాలో తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను సరిచేశామని, అయినప్పటికీ ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే సంబంధిత అధికారులకు లేదా 1912, 8712486131 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.