సోమేశ్వర స్వామి దేవాలయంలో విశేష పూజలు

సోమేశ్వర స్వామి దేవాలయంలో విశేష పూజలు

అన్నమయ్య: పవిత్ర కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా చిట్వేలిలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలో విశేష పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. సోమేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏక వార రుద్రాభిషేకం, పంచామృతాలతో శివలింగానికి అభిషేకం పలు పూజా కార్యక్రమాలను నిర్వహించారు.