VIDEO: హన్మకొండ చౌరస్తాలో ఉరేసుకుంటా: మాజీ స్పీకర్
HNK: తెలంగాణ మాజీ స్పీకర్, బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల అమలుపై సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ నిజంగా ఆరు గ్యారెంటీలు అమలైనట్లు తేలితే తాను హన్మకొండ చౌరస్తాలో ఉరేసుకుంటా అంటూ ధ్వజమెత్తారు.