రేపు ఈ గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేత
అనకాపల్లి: చీడికాడ మండలంలో పలు గ్రామాలకు రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ వెంకట్రావు తెలిపారు. చెట్ల కొమ్మలు తొలగింపు పనులు చేపడుతున్న కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు చీడికాడ, తురువోలు అర్జునగిరి చుక్కపల్లి జి.కొత్తపల్లి, వరాహపురం, తునివలస, బయలపూడి, దిబ్బపాలెం తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.