VIDEO: నేడు పట్టుబడిన వాహనాలకు వేలం పాట

వరంగల్: పలు కేసులలో పట్టుబడిన ద్విచక్ర వాహనాలకు వేలంపాట వేయనున్నట్లు వర్ధన్నపేట ఎక్సైజ్ సీఐ స్వరూప తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. ఎక్సెజ్ కేసులలో సీజ్ చేసిన బైకులకు డిప్యూటీ కమిషనర్, ప్రొహిబిషన్, ఎక్సెజ్ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మంగళ ఉదయం 10 గంటలకు వర్ధన్నపేటలోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద వేలంపాట వేయనున్నట్లు తెలిపారు.