'బోనాలు మీకు సమర్పిస్తాం.. భోగభాగ్యాలు ప్రసాదించు తల్లి'

BDK: అశ్వాపురం మండలం ఎస్సీ కాలనీలో శ్రావణ మాస ఆదివారం సందర్భంగా ముత్యాలమ్మకు భక్తులు బోనాలు సమర్పించారు. ఈ మేరకు ముందుగా ఇండ్ల నుంచి మహిళలు బోనాలు ఎత్తుకుని భాజా భజంత్రీలతో డప్పు చప్పులతో నృత్యం చేస్తూ.. గ్రామ శివారు ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి బోనాలు మీకు సమర్పిస్తాం.. భోగభాగ్యాలు ప్రసాదించు తల్లి అంటూ మొక్కలు చెల్లించుకున్నారు.