'గురుకుల పాఠశాల భవనం కూలిన ఘటనపై విచారణ జరిపించాలి'

'గురుకుల పాఠశాల భవనం కూలిన ఘటనపై విచారణ జరిపించాలి'

SRD: లింగంపల్లి గురుకుల పాఠశాల భవనం కూలిన ఘటనపై విచారణ జరిపించాలని యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాటికొండ రవి డిమాండ్ చేశారు. మన్నేపల్లి మండలం లింగంపల్లి గురుకుల పాఠశాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడైనా శిథిల గదిలో ఉంటే వెంటనే కూల్చి వేయించాలని కోరారు. బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.