ఆసుపత్రిలో చిన్నారికి పేరు పెట్టిన కవిత
NLG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిని ఇవాళ సందర్శించారు. ఈ నేపథ్యంలోనే మాతాశిశు కేంద్రంలో జన్మించిన చిన్నారికి దీక్ష అని పేరు పెట్టారు. చండూరు మండలం దోనిపాముల గ్రామానికి చెందిన బొప్పని రామస్వామి - మంజుల దంపతులు ఆసుపత్రిలో పాపకు జన్మనిచ్చారు. కాగా ఆస్పత్రిని సందర్శించిన సమయంలో కవిత వారితో అప్యాయంగా పలకరించి, పేరు పెట్టి చిన్నారి ఎత్తకున్నారు.