ఏజెంట్ పాస్‌లపై వాగ్వాదం.. ఎస్ఐ రాకతో..!
GDWL: అయిజ మండలం, ఉత్తనూరు గ్రామంలో ఏజెంట్ పాస్‌ల విషయంలో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆర్వో నిర్లక్ష్య వైఖరి కారణంగా సర్పంచ్ అభ్యర్థికి పాస్‌లు ఇవ్వలేదని ఒక వర్గం ఆరోపించింది. ఒక వర్గానికి పాస్‌లు రాత్రి సమయంలోనే ఇచ్చి, మరో వర్గానికి ఇవ్వకపోవడంతో, ఆ వర్గం పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి గొడవ జరిగిందన్నారు. స్థానిక ఎస్సై రావడంతో సద్దుమణిగింది.