మత్స్యకారులకు ఇంజన్‌లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
AKP: అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామంలో మత్స్యకారులకు ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శనివారం పీఎంఎంఎస్వై పథకంలో భాగంగా ఓబీఎం ఇంజన్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పూడిమడకలో త్వరలో జెట్టి నిర్మాణం పూర్తి కానున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారులను అన్ని విధాల ఆదుకుంటుందన్నారు. వేట పరికరాలను రాయితీపై అందజేస్తున్నట్లు తెలిపారు.