సుంకేసుల బ్యారేజీకి తగ్గిన వరద

GDWL: రాజోలి మండల కేంద్రం సమీపంలోని సుంకేసుల బ్యారేజీకి వరద ప్రవాహం తగ్గింది. సోమవారం ఉదయం బ్యారేజీకి 35,450 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో అధికారులు 7 గేట్లు ఒక మీటర్ మేరా ఎత్తి 30,884 కేసెక్కులు, కేసీ కెనాల్‌కు 2,445 క్యూసెక్కులు, మొత్తం 33,329 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ వరద నీరు శ్రీశైలం జలాశయం చేరుతుంది.