VIDEO: ఉగాది సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్
GDWL: మల్దకల్ మండల కేంద్రంలో క్రికెట్ టోర్నమెంట్ను ఘనంగా ప్రారంభించారు. ఈ పోటీలకు జిల్లాలోని వివిధ పల్లెల నుంచి క్రీడాకారులు ఉత్సాహంగా తరలివచ్చారు. మైదానంలో జట్లు విజయాల కోసం హోరాహోరీగా తలపడుతుండటంతో క్రీడా ప్రాంగణం సందడిగా మారింది. కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా, ఉగాది సందర్భంగా పలు గ్రామీణ క్రీడలను కూడా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.