రైతుల ఖర్చులతో 33 కేవీ స్తంభానికి మరమ్మతులు

PLD: వినుకొండ మండలం విఠంరాజుపల్లి-బ్రాహ్మణపల్లి ఎన్ఎస్పీ కాలువపై ఉన్న 33 కేవీ విద్యుత్ స్తంభం పడిపోకుండా బుధవారం రైతులు స్వయంగా మరమ్మతులు చేపట్టారు. అధికారుల సూచనతో వారు తమ ఖర్చులతో స్తంభాన్ని బలోపేతం చేసి, తీగలు తొలగించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎం నేతలు, స్థానికులు పాల్గొన్నారు.