తాడేపల్లి బకింగ్‌హామ్ కెనాల్‌లో మృతదేహం లభ్యం

తాడేపల్లి బకింగ్‌హామ్ కెనాల్‌లో మృతదేహం లభ్యం

GNTR: తాడేపల్లి బకింగ్‌హామ్ కెనాల్‌లో బుధవారం రాత్రి ఒక వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. సీఐ వీరేంద్రబాబు ఆధ్వర్యంలో ఎస్సై ఖాజావలీ, ఎస్డీఆర్ఎఫ్ బృందం కలిసి మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మృత దేహం ఎవరది అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.