ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే
MDK: పాపన్నపేటలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు పాల్గొన్నారు. స్థానిక ఫంక్షన్ హాల్లో ముస్లిం సోదరులతో కలిసి విందులో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా పేద ముస్లిం మహిళలకు 'రంజాన్ తోఫా' పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోవింద్ నాయక్, కిసాన్ సెల్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, ఇబ్రహీం, నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.