అరుదైన శస్త్ర చికిత్స... 6 కిలోల కణితి తొలగింపు

NRML: మహిళ కడుపులోని 6 కేజీల కణితిని భైంసా ఏరియా ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించారు. ముధోల్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన చిన్నమ్మ (58) అనే మహిళ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ.. భైంసా ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి 6 కిలోల కణితిని తొలగించి ప్రాణాపాయం నుండి కాపాడారు.