అభివృద్ధి పనులకు స్థాయి సంఘం పచ్చజెండా

KRNL: నగర సమగ్ర ప్రగతే లక్ష్యంగా అభివృద్ధి పనులకు నిధులు ఖర్చు చేస్తున్నట్లు నగరపాలక సంస్థ మేయర్ బీ.వై. రామయ్య అన్నారు. బుధవారం నగరపాలక కార్యాలయంలో స్థాయి సంఘ సమావేశం నిర్వహించారు. మొత్తం 12 తీర్మానాలు, రూ.4 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. చెత్తను తరలింపునకు 3 నెలల పాటు 10 అద్దె ట్రాక్టర్లను తీసుకొనుటకు రూ.41.86 లక్షలు కేటాయించారు.