సెల్ టవర్ సమీపంలో మృతదేహం లభ్యం
NZB: ధర్పల్లి మండలంలోని రేకులపల్లి గ్రామానికి చెందిన కాత్రాజి రాజశేఖర్(30) శనివారం ఎయిర్‌టెల్ సెల్ టవర్ సమీపంలో మృతదేహమై కనిపించాడు. గత నెల 31 నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్థుల సమాచారంతో ధర్పల్లి సీఐ భిక్షపతి, సిరికొండ ఎస్సై రామకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.