జొన్నగిరి జడ్పీ హైస్కూల్‌లో దివ్యాంగుల దినోత్సవం
కర్నూలు: తుగ్గలి మండల పరిధిలోని జొన్నగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రాజా రామ్మోహన్ ఆధ్వర్యంలో బుధవారం వికలాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష్య సాధనకు అంగవైకల్యం అడ్డు కాదని, ప్రతిభ ఉంటే దేనినైనా సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.