నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

VSP: విశాఖపట్నం జోన్-3లో మంగళవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు యు.జి. కేబుల్, మెయింటెనెన్స్ పనుల కోసం విద్యుత్ సరఫరా నిలుపుదల ఉంటుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి.సింహాచలం నాయుడు తెలిపారు. చేపలుప్పడ, కాపులుప్పడ సబ్ స్టేషన్లలో మరమ్మతులు జరుగుతాయన్నారు. అలాగే చిలుకూరి లేఅవుట్, పడుప్పడ ప్రాంతాల ప్రజలు సహకరించాలని కోరారు.