తెలంగాణ సారస్వత పరిషత్ గౌరవ సభ్యుడిగా జిల్లా వాసి

WNP: తెలంగాణ సారస్వత పరిషత్ గౌరవ సభ్యుడిగా వనపర్తి జిల్లాకు చెందిన ప్రముఖ కవి రచయిత కోట్ల వెంకటేశ్వర రెడ్డిని ఎంపిక చేయడం అభినందనీయం అని శనివారం సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి డా.జె.చెన్నయ్య కోట్ల వెంకటేశ్వర రెడ్డిని ఎంపిక చేస్తూ ఉత్తర్వులు అందజేశారు.