టెక్కెలో మంత్రి ఫరూక్ ఆకస్మిక తనిఖీ
నంద్యాల టెక్కె ప్రాంతంలోని సహకార సంస్థలను మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సోమవారం తనిఖీ చేశారు. రైతులకు సబ్సిడీలు, మహిళలకు రుణాల అమలుపై ఆరా తీశారు. లీజు గడువు ముగిసిన మార్కెట్ యార్డ్ షాపులను వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశించారు. తక్కువ అద్దెతో ఆదాయానికి నష్టం కలుగుతోందని పేర్కొన్నారు. అధికారులు పర్యవేక్షణ పెంచాలని సూచించారు.