మహానంది ఈశ్వరుని సన్నిధిలో జాయింట్ కలెక్టర్
నంద్యాల: మహానందిలో జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. ఆదివారం ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ మర్యాదలతో ఏఈఓ మధు స్వాగతం పలికారు. అనంతరం శ్రీ కామేశ్వర సమేత మహానందిశ్వర స్వామివార్లకు అభిషేక, అర్చన పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేయగా, అధికారులు శేష వస్త్రంతో సత్కరించారు.