VIDEO: వీధి వ్యాపారస్తులకు రుణాలు అందజేత
AKP: నర్సీపట్నం మెప్మా ఆధ్వర్యంలో పీఎం స్వానిధి సంకల్ప అభయాన్‌లో భాగంగా వీధి విక్రయదారులు, చిరువ్యాపారులకు రుణాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో 91 మంది లబ్ధిదారులకు రూ. 17.3 లక్షలు చెక్కులను పంపిణీ చేసామన్నారు. అందుకున్న రుణాల ద్వారా వ్యాపార అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.