జనసేన పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలి: ప్రశాంత్

JN: జనసేన పార్టీ బలోపేతానికి నియోజకవర్గంలోని జన సైనికులు అందరు సమిష్టిగా కృషి చేయాలని నియోజకవర్గ నాయకుడు మేడిద ప్రశాంత్ తెలిపారు. పాలకుర్తిలో ఆదివారం ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. అధినేత ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లి అధిక స్థాయిలో సభ్యత్వ నమోదు చేయాలని కోరారు. ప్రతి ఊరికి జనసేన సిద్ధాంతాలు ప్రచారం చేయాలన్నారు.