వీర జవాన్ తల్లిదండ్రులను ఓదార్చిన మంత్రి

AP: సరిహద్దుల్లో పాక్ జరిపిన కాల్పుల్లో శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన అగ్నివీర్ జవాన్ వీరమరణం చెందిన విషయం తెలిసిందే. గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీనాయక్ తల్లిదండ్రులను స్వయంగా వెళ్లి మంత్రి సవిత ఓదార్చారు. అనంతరం వీర జవాన్ తల్లిదండ్రులకు రూ.5 లక్షల చెక్కును మంత్రి అందజేశారు. మరో వైపు సీఎం చంద్రబాబు కూడా జవాన్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి పరామర్శించారు.