VIDEO: అదుపు తప్పి ఆటో బోల్తా.!

VIDEO: అదుపు తప్పి ఆటో బోల్తా.!

చిత్తూరు-బంగారుపాళ్యం మండలంలోని వేపనపల్లి గ్రామంలో ఆటో ప్రమాదం చోటుచేసుకుంది. 13 మంది విద్యార్థులు రాగిమానుపెంట హైస్కూల్‌కు వెళ్తున్న సమయంలో రాళ్ళవంకవద్ద ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 5 మందికి తీవ్ర గాయాలు కాగా, మిగిలిన 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.